Fool’s month

​Fool’s month….
ఈ నెలలోనే మనం కలిసాం

అప్పుడు కూడా నేనే వచ్చాను…

నిన్ను మొదటిసారి చూసినప్పుడు నా అనుభూతిని మాటల్లో చెప్పలేను

కొన్ని అంతే మాటలకు అందవు…

నీ కనులలో నేను చూసిన ఆ మెరుపు, నీ నవ్వు ఇప్పటికీ నన్ను వెంటాడుతూ ఉంటాయి

తలుచుకున్నప్పుడల్లా ఆశ్చర్యకరంగా ఉంటుంది

నువ్వు ఎవరు…!

నాకేం అవుతావు…!

నిన్ను అప్పటి వరకు ఎప్పుడు చూడలేదు నీ గొంతు తప్పా నాకేమి తెలియదు

అయినా నీ కోసం కొన్ని వందల మైళ్ళు దాటి వచ్చాను

మొదటి స్పర్శలోనే నన్ను నీకు రాసిచ్చుకున్నాను

ఏవిటా నమ్మకం ఎందుకా తెగింపు…!?

నిన్ను నా మనసులో మాత్రమేనా నా అణువణువునా నింపుకున్నాను

నీ ప్రతీదీ నాదిగానే భావించాను

నీ బంధాలని బాధలని నావనుకున్నాను

ఏమిటా పిచ్చి ఎందుకు ఈ ఉబలాటం…!!

ఎంత పిచ్చి ఆరాటమో కదా…?

నువ్వు వేరొకరి సొత్తని తనలో సగానివని తెలిసి తెలిసి ఎలా చేరువైయ్యాను…

నా పిచ్చి నీకు అర్ధం కాలేదు కదూ

ఇక ఎప్పటికీ అర్థం కాదు

నువ్వు నీ బాధ్యతలకు బంధీవి

నేను నండిసంద్రంలో చుక్కాని లేని నావని

మన ఇద్దరి దారులు ఎప్పటికీ చేరువకావు కాలేవు…ఎన్.కె

నిశీది రాత్రి


​నిశీది రాఁతి

ప్రపంచం మత్తుగా చీకటి ఒడిలో ఆదమరచి నిదురపోతుంది

హోరున గాలి వీచి చెట్టు చేమలను

చెల్లునకొట్టి నిదుర లేపింది…

హట్టత్తుగా వర్షం మొదలైంది ప్రియుడి కౌగిలిలో నెచ్చెలిలా భూమి ఆఁతంగా చినుకులను పొదివి పట్టుకొని తనలో కలిపేసుకుంది…

మల్లె తీగ వయ్యారంగ ఊగుతూ కవ్విస్తుంటే 

ఉరుములు ఉలిక్కిపడుతూ వచ్చిపోతుంన్నాయి

ప్రకృతి సోయగం… 

ఆవెదురు వనాలను ప్రేమతో బుజ్జగిస్తూ లాలనగా లాలిస్తుంది

ఏమో మధురమైనా రాఁతిల ప్రతీ కదలిక ఆనందంగా ఉంన్నటుంది…

దూరంగా ఒక  ప్రేమ జంట వర్షంలో తడుస్తూ నడుస్తుంన్నారు

సాయంఁతం కృష్ణుడి ప్రతిమ ముందు పెట్టిన పువ్వులు కసాయిలా కోసి కట్టినా నవ్వుతూ నా వంక చూస్తుంన్నాయి…

నా మనసులో బాధ కనులను కమ్మేసి కడలిగా పోంగిపోతుంది

హృదయమొక నరకమైంది 

హృదయాంతరం కలవరమై 

మరువలేని ప్రేమ ప్రతీ క్షణం ప్రశ్నలతో హృదయాన్ని గుచ్చుతుంది నిన్ను తనకింమ్మని…

ఎలా ఇవ్వను…? ఎంతని నచ్చచెప్పను…!ఎస్.కే

అర్థం కాని ప్రశ్న…

​ఏమని రాయాలి…

ఎలా మొదలు పెట్టాలి…

వీడ్కోలు ముందే తెలిస్తే ఎవరూ కలవాలని అనుకోరు కదూ…!?

మరి తెలిసీ నేను నిన్ను ఎలా కలిసానంటావ్…!?

కొన్ని ముగింపులలా ప్రారంభం కూడా మన చేతిలో ఉండదూ…

నువ్వంటే నాకు పిచ్చి…

నీ ప్రతీదీ నాకు పిచ్చే

నువ్వంటే పడి చచ్చిపోతాను నీ తలపులలో ప్రతీ నిమిషం మేలుకుంటాను…

ఈ ఆరాటం పిచ్చి తనంలా ఉంది కదూ…

ప్రేమకు మరో పేరు పిచ్చి….
ఎడారి దారుల గుండా

బంధాలు అనే ఎండమావుల వెంట పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను

అను రాగాల వేసవి గాలులకు

మనసు ఎంతగా బీటలు వాలిందో చెప్పలేనోయ్
నువ్వో ఆశల ఊబివి, నీలో చిక్కుకున్నాక నాకు నేను దూరం అయిపోయాను

నాకంటూ ఎవ్వరూ లేని ఒంటరిదానినోయ్

నీకో ప్రపంచం ఉంది

భార్య, పిల్లలు, ఉద్యోగం, స్నేహితులు…!

మరి నాకు

నాకంటూ ఎవ్వరూ లేరు నా ప్రపంచం మొత్తం నువ్వే…
చిత్రం ఏమిటో తెలుసా

నెను అనుకుంటున్న నా ప్రపంచం నాకు లేనేలేదు

నువ్వు ఎప్పటికీ నాకై రావు

నన్ను ప్రేమించలేవు

ఎవరికి ఏమి కాని ప్రశ్నను నేను…ఎస్.కే

నాకు ఆశలు ఉండేవి

;

​నాకు కొన్ని ఆశలు ఉండేది
నన్ను ప్రేమించేవాడు నన్ను మాత్రమే ప్రేమించేవాడితో కలిసి ఏడడుగులు వెయ్యాలని…

మూడు ముళ్ళు చిటికెడు కుంకుమ అందుకుని బ్రతుకునే రాసి ఇవ్వాలని…

ప్రతీ రోజూ అతనికి ముద్దిచ్చి వీడ్కోలు చెప్పాలని

తనకు నచ్చిన వన్నీ రుచుగా చేసి వడ్డించాలని

సాయంత్రాలన్నీ నవ్వులతో ఆహ్వానించి ప్రేమగా అతని తలను నిమరాలని…

నా కలలన్నీ ఖరీదు చేసి అతని ఇష్టాలను పంచి ఇవ్వాలని

తన కోపంలో

తన నవ్వులలో

తన చిరాకులో

తన బాధలో

తన స్పర్శలో

తన నీడలో నేను వెలిగిపోవాలని తనకై కరిగిపోవాలని…

నా పేరు పక్కన తన పేరు కలిపి రాయాలని

తన ఇంటి పేరు నాతో జోడించాలని

తన ప్రేమని నా ఒడిలో మొయ్యాలని

ఎన్నో ఎన్నో ఆశలు ఉండేవి…

నెరవేరనివి కలలైనవి…ఎస్.కే

పిచ్చి…

ఎప్పుడు కనిపిస్తావోయ్…!?

చూసి యుగాలైపోతుంది

మనసు దాహం తీరేలా ఒక్కసారి హత్తుకునిపోవోయ్

ఏమిటా నవ్వు నా దాహం ఎప్పటికీ తీరనిదనా…?

నిజమే బంగారం ఎన్ని జన్మలైనా నీపై నా ప్రేమ తీరదు…!

పదేపదే మనసు పొలమారుతుందోయ్

నువ్వు నా మనసుకి ఉన్నంత దగ్గరగా నా కనుల ముందుంటే ఎంత బాగుండేదోయ్…

ఓయ్…

నాకు నీ మాటలలో తడవాలని ఉంది

నీ తొలి చూపుతో మాయలో పడేసావా

నన్ను నీకు అంకితమిచ్చేసా పిచ్చి ప్రేమనై…

ప్రపంచం వద్దన్నా ప్రతీ క్షణం నిరీక్షణలైనా బ్రతుకు నీకు రాసిచ్చేసా…

కనుల కలవరాలలో జ్ఞాపకాల జల్లులు మనసెంతగా తడిసినా తనివితీరదు తపన ఆగదు…

నీ ఎడబాటు కూడా వరమేనోయ్ నిన్ను  మరింతగా నాలో పొదువుకుంటు…ఎస్‌. కే

రాజీ

రాజీ..
రాజీ….
బ్రతుకంతా రాజీ అయిపోయింది…
కొన్ని కలలని
కొన్ని ఇష్టాలని
ఇంకొన్ని కన్నీళ్ళనీ….
వదిలేసి వెళుతున్నాను ఇక్కడ
ఈ మలుపు చివర ఈ వీడ్కోలు
మనసుని ఎప్పుడూ తడుపుతూనే ఉంటుంది…
నాకు నేను ఇక్కడ చితిని వెలిగించి వెళుతున్నాను…
రాతి బొమ్మనై మరో జన్మను వెతుకుతూ
అక్కడ నా కలలు ఉంటాయో లేవో
నేను మాత్రం ఉంటాను…
అబద్దపు ముసుగు తీసి నిజంలో వెలిగిపోతాను…ఎస్.కే 

మనసు

​బంగారం….

ముద్ద పప్పు….

బుద్ధవిఁగహం….

మొఖం చూడు….! 

ఎందుకోయ్ నీపై ఈ పిచ్చి ఆపేక్ష…?

ఎవరు నువ్వు….?

నాకేమౌతావు….? 

నాలోని సగనివా….? 

మరీ నీలోని సగమో…?

చిత్రం కదూ మన బంధం…!

నాలోని నిన్ను తీసేస్తే నేను సూన్యాన్ని…

నీలోని నన్ను తీసేస్తే నువ్వు పరిపూర్ణానివి…

సుడిలో చిక్కి విలవిలలాడే ఈ మనసుకు నీపై ఈ తీరని మమకారం ఏంటి…? పోని నీకైనా తెలుసా…!

వాడిపోయిన పువ్వులకి కృష్ణుడి యదపై పూలమాల కావాలని ఆశేమిటో…!

నలిగిన శరీరంలో నలగని మనసు ఒకటుందోయ్ ఆ మనసులోని ధ్యానాలు నీవే…ఎస్.కే